![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1059 లో..... వెంకీ సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చిందని ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి బయటకు వస్తాడు. ఆమ్మో ఇంట్లో ఫస్ట్ టైమ్ ఇంత పెద్ద అబద్ధం ఆడానని వెంకీ అనుకుంటాడు. బైక్ స్టార్ట్ చేస్తుంటే అవ్వదు.. అప్పుడే తన ఓనర్ ఫోన్ చేసి ఇంకా బయల్దేరలేదా అని కోప్పడతాడు. బైక్ స్టార్ట్ అవట్లేదు.. ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తాడు. మరొకవైపు ఇందుకి కొరియర్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూసి చదవబోతుండగా.. ఏంటి ఏంటో చదువు వచ్చిన దానిలాగా చూస్తున్నావని భ్రమరాంబ అంటుంది.
రేఖ ఆంటీ ఇందులో ఏముందో చూసి చెప్పండి అని ఇందు కవర్ చేస్తుంది. అది భూషణ్ చదువుతాడు. ఇప్పటివరకు మనకి రా మెటీరియల్ సప్లై చేసిన అతను ఇక చెయ్యనని అంటున్నాడని అందులో చూసి చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఇప్పుడు రా మెటీరియల్ లేకపోతే కంపెనీ నష్టాల్లోకి వెళ్తుందని రేఖ అంటుంది. ఆంటి మీరే ఏదో ఒకటి చెయ్యండి అని ఇందు అంటుంది. నేనే సీఈఓ అయినా కానీ మీరు చెప్పిందే చేస్తాను కదా అని అంటుంది. నీకు సంబంధించినవన్ని కూడా మీ అయన చూసుకుంటానని చెప్పాడు కదా నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడమని రేఖ అంటుంది. ఈ ప్రాబ్లమ్ ఎలా క్లియర్ చేస్తారో.. నేను చూస్తానని రేఖ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చెయ్యాలో రాజు, ఇందు ఆలోచిస్తారు. నిన్న ఎదురు మాట్లాడానని కావాలనే ఇదంతా చేసింది ఆ రేఖ అని రాజు అంటాడు.
అప్పుడే సుభాష్, అపర్ణ వస్తారు. మనకి చాలా మంది క్లయింట్స్ ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్లలో ఎవరు మనకి సపోర్ట్ గా ఉన్నారనేది తెలియాలి.. అప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అందుకు మనం ఒక పార్టీ ఏర్పాటు చెయ్యాలి ఇందు సీఈఓ అయినందుకు.. అప్పుడు వాళ్లలో ఎవరు మనకి సపోర్ట్ గా ఉన్నారనేది తెలుస్తుందని సుభాష్ ఐడియా ఇస్తాడు. మరి ఇప్పుడు పార్టీ అంటే ఆ రేఖ ఒప్పుకోదు కదా అని రాజు అంటాడు. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.. తన ముందు రెచ్చగొట్టేలా మాట్లాడాలి.. అందుకు నానమ్మ మీ ఫ్రెండ్ శకుంతల ఉంది కదా తనని రప్పించమని ఇందు ఒక ఐడియా చెప్తుంది. ఆ తర్వాత వెంకీ డెలివరీ బాయ్ గా జాయిన్ అయి ఫుడ్ డెలివరీ కోసం సైకిల్ పై వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |